Telangana Politics : దేశ రాజకీయాలలో తెలంగాణ భిన్నమైంది. ఇక్కడ జాతీయ పార్టీలకు అంతగా ఫోకస్ ఉండదు. కానీ ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాషాయం గుభాళించింది. దీంతో ఆ పార్టీ తెలంగాణ (Telangana Politics) పై కన్నేసింది.
మరో వైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) దానిని క్యాష్ చేసుకోలేక పోయింది.
ఇదే సమయంలో పంజాబ్ లో పవర్ లో ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిన దెబ్బకు కోలుకోలేక పోయింది.
మిగతా రాష్ట్రాలలో సైతం సత్తా చాటలేక చేతులెత్తేసింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస పార్టీ (Congress Party) ప్రస్తుతం తీవ్ర వత్తిడికి లోనవుతోంది. జీ23 అసమ్మతి స్వరం వినిపిస్తోంది.
ఈ తరుణంలో పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది సోనియా గాంధీ(Sonia Gandhi) . ఇక ఏపీలో ఆ పార్టీ ఉందో లేదో కూడా తెలియడం లేదు. జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీతో పాటు కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది.
టీడీపీ కొన్ని సీట్లు గెల్చుకుని పరువు పోకుండా కాపాడుకుంది. పంజాబ్ లో ఊడ్చి పారేసిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది.
ఇక ఇప్పటికే తెలంగాణ (Telangana) ఉద్యమం పేరుతో రెండో సారి కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆక్టోపస్ లా కూరుకు పోయింది.
దీనిని దెబ్బ కొట్టాలంటే బీజేపీ, కాంగ్రెస్, ఆప్ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ (Telangana Politics)మధ్య పోటీ నెలకొంది.
ఈ తరుణంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారి పోయాయి. ఆప్ కూడా తెలంగాణలో పాగా వేయాలని అనుకుంటోంది.
మరి వర్కవుట్ అవుతుందా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే ఆప్ తన పనిని ప్రారంభించింది.
వైసీపీ కూడా పాదయాత్ర చేపట్టింది. అమిత్ షా తో పాటు రాహుల్ గాంధీ , కేజ్రీవాల్ లు తెలంగాణలో (Telangana) సభలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రజల నాడి ని తెలుసు కోవడం చాలా కష్టం. టీఆర్ఎస్(Telangana Politics) ను దెబ్బ కొట్టాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆప్ పూర్తిగా కేసీఆర్ సర్కార్ పై మండి పడుతోంది.
కాంగ్రెస్ డైరెక్ట్ అటాకింగ్ స్టార్ట్ చేసింది. బీజేపీ అరెస్ట్ చేస్తామంటోంది కానీ కేసీఆర్ ను ముట్టు కోవడం లేదు.
Also Read : ఇంతకీ విజయమ్మ రాజీనామా ఉన్నట్టా? లేనట్టా?