హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’కు కొనసాగింపుగా (సీక్వెల్) తెరకెక్కింది. ఇది ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్కును అధిగమించినట్లు సమాచారం. ఇది సినిమా విజయంపై మరింత చర్చకు దారితీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా దూసుకు పోతున్న తరుణంలో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్.. రజనీకాంత్‌ను ‘జైలర్ 2’ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
రజనీకాంత్‌కు మాత్రమే సొంతమైన ప్రత్యేక శైలి, స్వాగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొనియాడారు. ‘జైలర్ 2’ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినందుకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, మొత్తం చిత్ర బృందాన్ని అల్లు అర్జున్ అభినందించారు. తన పోస్ట్‌లో రజనీకాంత్ తన సహజమైన ఆకర్షణతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని ఎలా సాధించగలరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూపర్ స్టార్ శైలి , స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇద్దరు నటుల అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
‘జైలర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన మొదటి రోజు వసూళ్లు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు, ఈ సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనపై చర్చను మరింత పెంచాయి. రజనీకాంత్ కు ఉన్న ప్రజాదరణ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వ ప్రతిభ, అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ప్రశంసలు, ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చను మరింత విస్తృతం చేశాయి. అల్లు అర్జున్ ‘రాకా’తో బిజీగా ఉన్నారు
