Allu Arjun Record : థ్రెడ్స్ యాప్ లో బన్నీ రికార్డ్

వ‌న్ మిలియ‌న్ ఫాలోయ‌ర్స్

Allu Arjun Record : ట్విట్ట‌ర్ కు ప్ర‌త్యామ్నాయంగా ఫేస్ బుక్ తీసుకు వ‌చ్చిన థ్రెడ్స్ యాప్ లో సైతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హ‌వా కొన‌సాగుతోంది. న‌టుడిగా ఇప్ప‌టికే టాప్ రేంజ్ లో కొన‌సాగుతూ వ‌చ్చాడు యూత్ స్టార్. ఆయ‌న న‌టించిన పుష్ప మూవీ రికార్డుల మోత మోగించింది.

Allu Arjun Record In Threads

ఇక సామాజిక మాధ్య‌మాల‌లో బ‌న్నీకి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ల‌క్ష‌ల్లో అత‌డి అభిమానులు త‌న‌ను ఫాలో అవుతుంటారు. ఇప్ప‌టికే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటాడు. అభిమానుల‌కు ప‌రీక్ష కూడా పెడుతుంటాడు.

ఇటీవ‌లే హైద‌రాబాద్ లో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో థియేట‌ర్ ను కూడా ఓపెన్ చేశాడు. తాజాగా థ్రెడ్స్ యాప్ లో అల్లు అర్జున్(Allu Arjun) అరుదైన ఘ‌న‌త సాధించాడు. అదేమిటంటే థ్రెడ్స్ యాప్ ప్రారంభించిన కొద్ది సేప‌ట్లోనే త‌న అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు బ‌న్నీ.

దీంతో విష‌యం తెలుసుకున్న త‌న ఫ్యాన్స్ ఊరుకుంటారా. అల్లు అర్జున్ ను ఫాలో అవుతూ వెళ్లారు. చివ‌ర‌కు అతి త‌క్కువ కాలంలోనే వ‌న్ (1) మిలియ‌న్ అభిమానుల‌కు చేరుకుంది. టాలీవుడ్ కు సంబంధించి ఏ హీరోకు లేనంత మంది ఫ్యాన్స్ బ‌న్నీని ఫాలో కావ‌డం విశేషం.

Also Read : KTR BUS Viral : హైద‌రాబాద్ లో ‘కేటీఆర్ బ‌స్సు’ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!