Maruti Suzuki Alto K-10 : సూపర్ ఫీచర్స్ తో ఆల్టో కె-10 మోడల్
మార్కెట్ లోకి విడుదల చేసిన మారుతి
Maruti Suzuki Alto K-10 : భారతీయ ఆటోమొబైల్ సెక్టార్ లో మారుతి సుజుకి కంపెనీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని కొత్త బ్రాండ్లు, కంపెనీలు వచ్చినా నేటికీ ఇండియన్ మార్కెట్ లో మారుతి తన వాటాను పెంచుకుంటూ పోతోంది తప్పా తగ్గడం లేదు.
వాహనదారుల అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా కార్లను తయారు చేయడంలో ఫోకస్ పెడుతోంది కంపెనీ. ఇప్పటికే తాను విడుదల చేసిన మోడల్స్ లో ఆల్టో మోడల్ మోస్ట్ పాపులర్.
వీటి స్థానంలోనే ఆల్టో కె10 ఉండేది. టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా తాజాగా గురువారం ఆల్టో కె -10 మోడల్ ను లాంచ్ చేసింది.
ఇదిలా ఉండగా ఆల్టో కె10 , 2022(Maruti Suzuki Alto K-10) కేవలం ప్రారంభ ధర రూ. 3,99,000 గా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ మోడల్ లో నాలుగు వేరియంట్ల (కలర్స్ )లలో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఈ మోడల్స్ కావాలనుకునే వారి కోసం మారుతి సుజుకి ఇప్పటికే కొత్త దానిని బుకింగ్ కోసం చేసుకునే వీలు కల్పించింది. ఆసక్తి కలిగిన వారు ఆల్టో కె10, 2022ను రూ. 11,000తో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది కంపెనీ.
ఇదిలా ఉండగా ఈ మోడల్ కార్లను ఏకంగా 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించి రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఆల్టో 800 పేరుతో విడుదల చేసింది. కానీ ఆల్టో కె 10 ను లాంచ్ చేయడం విశేషం.
అత్యాధునిక ఫీచర్స్ ను ఏర్పాటు చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆల్టో కె10ను బుక్ చేసుకోండి.
Also Read : టెలికాం కంపెనీలకు కేంద్రం ఖుష్ కబర్
Nice 👍