Aman Khan : మెరిసిన అమ‌న్ హ‌కీం ఖాన్

44 బంతులు 3 ఫోర్లు 3సిక్స‌ర్లు 51 ర‌న్స్

Aman Khan : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఊహించ‌ని షాక్ త‌గిలింది గుజ‌రాత్ టైటాన్స్ కు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఆ జ‌ట్టుకు అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న డేవిడ్ వార్న‌ర్ సేన చుక్క‌లు చూపించింది. ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన లీగ్ మ్యాచ్ లో 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 130 ర‌న్స్ చేసింది. గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ నిప్పులు చెరిగాడు. బుల్లెట్ల లాంటి బంతుల‌తో రెచ్చి పోయాడు. త‌ట్టుకోలేక ఢిల్లీ బ్యాట‌ర్లు పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. 4 ఓవ‌ర్లు వేసిన ష‌మీ 4 కీల‌క వికెట్లు తీశాడు. ఓ వైపు ష‌మీ ముప్పు తిప్ప‌లు పెడుతుంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ అమ‌న్ హ‌కీం ఖాన్(Aman Khan) మాత్రం షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు.

44 బంతులు ఎదుర్కొన్న అమ‌న్ హ‌కీం ఖాన్ 3 ఫోర్లు 3 సిక్స‌ర్లో 51 ర‌న్స్ చేశాడు. ఆ జ‌ట్టులో ఇదే అత్య‌ధిక స్కోర్. మ‌రోసారి రాణించాడు ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ . అత్యంత విలువైన 27 ర‌న్స్ చేశాడు. మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రూ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయారు. ఇదిలా ఉండ‌గా 131 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ చివ‌రి దాకా పోరాడింది. కానీ ఫ‌లితం లేక పోయింద‌. ఇషాంత్ శ‌ర్మ మ్యాజిక్ చేయ‌డంతో 5 ర‌న్స్ తేడాతో ఓడి పోయింది.

Also Read : చుక్క‌లు చూపించిన ష‌మీ

Leave A Reply

Your Email Id will not be published!