Virat Kohli : అద్బుత విజయం శుభ సంకేతం – కోహ్లీ
శ్రీలంకపై ఘన విజయం ఉత్సాహం
Virat Kohli : శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీరీస్ లో స్టార్ బ్యాటర్ , మాజీ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ కూడా చేజిక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు విరాట్ కోహ్లీ. ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరుణంలో భారత జట్టు విజయాలు సాధించడం ఒకింత బలాన్ని ఇచ్చేలా చేసిందంటూ పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.
ఒక రకంగా తనకు ఈ ఏడాది శుభారంభం ఇవ్వడం సంతోషం కలిగిస్తోందని చెప్పాడు. ఈ విజయం రాబోయే ప్రపంచ కప్ లో మరింత దూకుడుగా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు. భారత జట్టు అన్ని విభాగాలలో రాణించిందని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ప్రధానంగా హైదరాబాద్ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబర్చాడని కొనియాడాడు.
మరో వైపు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా లేక పోవడంతో కొంత ఇబ్బంది కలిగిందని, కానీ సిరాజ్ ఉండడం వల్ల ఆ లోటు పూర్తిగా తీరి పోయిందని అన్నాడు విరాట్ కోహ్లీ. ఇక మహమ్మద్ షమీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే జట్టుకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఇక సిరాజ్ తన పని తాను కానిచ్చేశాడంటూ పేర్కొన్నాడు.
Also Read : ఉత్కంఠ పోరులో ఓడిన కీవీస్