Amazon Layoffs : ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్ ఫోకస్
రంగం సిద్దం చేసిన ఇకామర్స్ సంస్థ
Amazon Layoffs : ఇకామర్స్, లాజిస్టిక్ రంగంలో టాప్ లో కొనసాగుతున్న కంపెనీలు కూడా ఇప్పుడు ఐటీ కంపెనీల బాట పట్టాయి. ఇప్పటికే టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు 10 వేల మందిని తొలగించారు. ఆపై తానేమీ తక్కువ కాదంటూ మార్క్ జుకర్ బెర్గ్ సారథ్యంలోని మెటా (ఫేస్ బుక్ ) లో 10 వేల మందిని తొలగించినట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఇక మరో ప్రముఖ సంస్థ గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫా బీటాలో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు సదరు సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్. ఈ తరుణంలో జెఫ్ బెజోస్ సారథ్యంలోని అమెజాన్ లో నిన్నటి వరకు ఏ ఒక్కరిని తొలగించబోమంటూ ప్రకటించారు.
ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా తెలియ చేసింది సంస్థ. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ ఏకంగా 20 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఇదే విషయం గురించి చావు కబురు చల్లగా చెప్పింది అమెజాన్(Amazon Layoffs). కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ మందిని నియమించు కున్నామని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని దీంతో వారి అవసరం తీరి పోయిందని స్పష్టం చేసింది అమెజాన్.
ఈ మేరకు ఉద్యోగుల పనితీరు ఏమాత్రం బాగా లేక పోయినా వెంటనే వారిని గుర్తించి సాగనంపాలని సదరు బాధ్యతలు చూస్తున్న మేనేజర్లను ఆదేశించింది అమెజాన్. దీంతో సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. ఎవరి ఉద్యోగాలు ఉంటాయో ఉండవోనని.
Also Read : టాప్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ బేకర్ పై వేటు