Isha Ambani : యువ రాణిని పరిచయం చేసిన అంబానీ
రిలయన్స్ రిటైల్ బిజినెస్ లీడర్
Isha Ambani : రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) సోమవారం కీలక ప్రకటన చేశాడు. ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన సంస్థగా జియో ఎదిగిందని వెల్లడించాడు.
అంతే కాదు తన సామ్రాజ్యానికి సంబంధించి రిలయన్స్ రిటైల్ బిజినెస్ లీడర్ గా తన కూతురు ఇషా అంబానీని ఇవాళ ప్రత్యేకంగా పరిచయం చేశాడు.
మరొక దానిలో బిలియనీర్ ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒక దానిలో వారసత్వం కోసం ఒక ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.
ఆ ప్రకటన జూన్ లో టెలికాం యూనిట్ రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ చైర్మన్ గా ఆకాశ్ అంబానీ నియామకాన్ని అనుసరించింది.
ఇక నూతనంగా నాయకురాలిగా పరిచయం అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎం (వార్షిక సాధారణ సమావేశం ) లో ఇషా అంబానీ(Isha Ambani) మాట్లాడారు.
ఇక నుంచి రిలయన్స్ రిటైల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వ్యాపారాన్ని ప్రారంభించనుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా తమ బ్రాండ్ మరింత విస్తరించేలా చేస్తామన్నారు.
విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉండడం తమకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అంటూ పేర్కొన్నారు ఇషా అంబానీ. ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సు ఉన్న ఇషా అంబానీ యేల్ యూనివర్శిటీలో చదివారు.
అనంత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇతడి కోసం దుబాయ్ లో భారీ ఖర్చుతో ఓ బంగ్లాను కొనుగోలు చేశాడు ముఖేష్ అంబానీ.
మొత్తంగా ఇషా అంబానీ ఎంట్రీతో ఎఫ్ఎంసీజీ రంగంలో మరింత పోటీ ఎదురు కానుంది.
Also Read : దీపావళి నాటికి జియో 5జీ ధమాకా – అంబానీ