Amber Heard : జ్యూరీ తీర్పుపై మరోసారి అంబర్ కోర్టుకు
తనపై కక్షగట్టి తీర్పు చెప్పారంటూ ఆరోపణ
Amber Heard : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురి చేసిన హాలీవుడ్ నటీనటుల కేసులో చివరి తీర్పు సంచలనాత్మకంగా మారింది. ఈ సమయంలో తీర్పు జానీ డెప్ కు అనుకూలంగా వచ్చింది.
ఆయనపై మాజీ భార్య, ప్రముఖ నటి అంబర్ హియర్డ్(Amber Heard) కోర్టుకు ఎక్కింది. తనను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తున్నాడంటూ ఆరోపించింది.
ఆపై తనకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జ్యూరీ సంచలన తీర్పు వెలువరించింది. చివరకు అంబర్ హియర్డ్ నేరస్తురాలని, ఆమె ఆరోపణలలో వాస్తవం లేదంటూ స్పష్టం చేసింది.
అంతే కాకుండా జానీ డెప్ పరువుకు భంగం కలిగించినందుకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. యావత్ ప్రపంచం జానీ డెప్ వైపు నిలబడింది.
ఈ తరుణంలో తాజాగా జానీ డెప్(Johnny Depp) మాజీ భార్య అయిన అంబర్ హియర్డ్ శనివారం సంచలన కామెంట్ చేసింది. జ్యూరీ తన పట్ల వివక్ష ప్రదర్శించిందంటూ ఆరోపించింది.
మరోసారి ఈ కేసును విచారించాలని కోరింది. జ్యూరీలో కూర్చున్న జడ్జీలలో కొందరు జానీ డెప్ వైపు ఉన్నారంటూ ఆరోపించింది అంబర్ హియర్డ్. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్లు మరోసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు.
అమెరికా కోర్టు తాజాగా విచారణకు ఆదేశించాలని కోరారు. యుఎస్ కోర్టుకు డ్యూ ప్రాసెస్ లో రాజీ పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అంబర్ హియర్డ్ తనను పరువు తీశాడని జానీ చేసిన వాదనకు మద్దతుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇదిలా ఉండగా జానీ డెప్ కు $10 మిలియన్ల పరిహారం, $5 మిలియన్ల శిక్షాత్మక నష్ట పరిహారం చెల్లించాలని వర్జీనియా కోర్టు జ్యూరీ అంబర్ ను ఆదేశించింది.
Also Read : హాట్ హాట్ గా సెగలు రేపుతున్న హెబ్బా ..