Amit Malviya PV : పీవీని అవమానించింది మీరు కాదా
అమిత్ మాలవీయ షాకింగ్ కామెంట్స్
Amit Malviya PV : ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ దివంగత ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ. జూన్ 28న ఆయన జయంతి. ఇవాళ 102వ జయంతి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ , పశ్చిమ బెంగాల్ కో ఇంఛార్జి, జాతీయ కార్యవర్గ సభ్యుడు , మాజీ బ్యాంకర్ అయిన అమిత్ మాలవీయ(Amit Malviya) నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీపై.
దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించిన పీవీని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తుండడంతో పీవీ జయంతిని హఠాత్తుగా ఆ పార్టీ గుర్తు చేసుకుని నిర్వహించడం దారుణంగా ఉందని పేర్కొన్నారు. సోనియా గాంధీ పీవీ పట్ల అనుసరించిన వైఖరి గురించి యావత్ దేశం చూసిందని స్పష్టం చేశారు.
ఆయన చని పోయినప్పుడు భౌతిక కాయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ భవన్ లో కూడా ఉంచేందుకు అనుమతించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు అమిత్ మాలవీయ. సరీళకరణ, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. ఆయన వారసత్వాన్ని తుడిచి పెట్టే ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. 10 ఏళ్ల తర్వాత మోడీ ప్రభుత్వంలో ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతిలో స్మారక చిహ్నం పొందారని గుర్తు చేశారు.
Also Read : AP CM YS Jagan : నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం