AP CM YS Jagan : నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం
ఏపీ సీఎం జగన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ను దత్త పుత్రుడుగా పేర్కొన్నారు. ఆపై ఈ ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడంటూ ఎద్దేవా చేశారు జగన్ . వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్లు, నోరు ఎలా తిరిగితే అలా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. ఆయనలా నేను బూతులు తిట్టలేనని అన్నారు. బుధవారం జగన్ రెడ్డి సభలో ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ లా నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యలను మార్చ లేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని రోడ్డు పైకి తీసుకు రాలేమన్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనే దత్త పుత్రుడికి పేటెంట్ అంటూ సెటైర్ వేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). స్థాయిని మరిచి మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారంటూ స్పష్టం చేశారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, నోటికి ఎంత వస్తే అలా మాట్లాడటం, సభ్యతా సంస్కారం లేకుండా పదే పదే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఒకవేళ తాము గనుక రంగంలోకి దిగితే సీన్ వేరేలా ఉంటుందని అన్నారు జగన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు సీఎం.
Also Read : Sri Kapileswara Swamy : కపిలేశ్వరాలయంలో ఉత్సవాలు
