Sri Kapileswara Swamy : క‌పిలేశ్వ‌రాల‌యంలో ఉత్స‌వాలు

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

Sri Kapileswara Swamy : జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల లోని ప్రసిద్ద ఆల‌య‌మైన శ్రీ క‌పిలేశ్వ‌ర(Kapileswara Swamy) ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు భ‌క్తులు సంద‌ర్శించు కోవాల‌ని సూచించింది. ఉత్స‌వాల‌లో భాగంగా ముందు రోజు అంటే జూన్ 29న సాయంత్రం 6 గంట‌ల నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.

ఏడాది పొడ‌వునా ఆల‌యంలో జ‌రిగే అర్చ‌న‌లు, ఉత్స‌వాల్లో తెలియ‌క ఏవైనా దోషాలు జ‌రిగినా, ఆల‌య ప‌విత్ర‌త‌కు ఎలాంటి లోపం రానీయ‌కుండా శైవాగ‌మ శాస్త్రం ప్ర‌కారం ప‌విత్ర ఉత్స‌వాలు చేప‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇక ఉత్స‌వాల‌కు సంబంధించి జూన్ 30న శుక్ర‌వారం ఉద‌యం ఉత్స‌వ మూర్తుల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం , సాయంత్రం యాగ శాల పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 1న శ‌నివారం రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ ఉంటుంది. సాయంత్రం యాగ శాల పూజ , హోమం నిర్వ‌హిస్తారు.

జూలై 2న ఆదివారం ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు. సాయంత్రం 6 గంట‌ల‌కు పంచ మూర్తులైన శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ విఘ్నేశ్వ‌ర స్వామి, శ్రీ సుబ్ర‌మ‌ణ్య స్వామి, శ్రీ చండికేశ్వ‌ర స్వామి వార్ల‌కు ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తార‌ని టీటీడీ తెలిపింది.

Also Read : Sharad Pawar Comment : కార్ల కాన్వాయ్ తో బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా

Leave A Reply

Your Email Id will not be published!