Sharad Pawar Comment : కార్ల కాన్వాయ్ తో బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా

ఇదేమ‌న్నా కార్ల పోటీనా అంటూ ఎద్దేవా

Sharad Pawar Comment : ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar) షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ నుంచి ఏకంగా 600 వాహ‌నాల కాన్వాయ్ తో అడుగు పెట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేమైనా కార్ల పోటీనా అని ఎద్దేవా చేశారు. ఒక‌ర‌కంగా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గతంలో ప‌లుమార్లు శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేను, ప‌వార్ ను క‌లుసుకున్నారు సీఎం కేసీఆర్. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న త‌న పంథా మార్చుకున్నారు.

ఒక్క‌డే ఒంట‌రిగా బ‌య‌లు దేరుతున్నారు. రాబోయే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండాను దేశ వ్యాప్తంగా ఎగుర వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ప్ర‌ధానంగా ఎన్నిక‌లు లేక పోయినా ఇప్పుడు కేసీఆర్ ఫోక‌స్ అంతా మ‌రాఠాపై ప‌డింది. ఇప్ప‌టికే స‌భ‌లు, స‌మావేశాల‌తో హోరెత్తిస్తున్నారు. మ‌రోవైపు శివ‌సేన పార్టీకి చెందిన జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ సైతం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఆయ‌న ఓట‌మి భ‌యంతో మాట్లాడుతున్నార‌ని మ‌రాఠాలో కేసీఆర్ కు అంత సీన్ లేద‌న్నారు. ఎవ‌రో కొంత మంది చేరినంత మాత్రాన త‌మ‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేద‌న్నారు. ముందు త‌న ఇల్లు చ‌క్క బెట్టుకుంటే బెట‌ర్ అని సూచించారు. కేసీఆర్ తాను ఎవ‌రి ప‌క్షమో ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. ఈ త‌రుణంలో తాజాగా శ‌ర‌ద్ ప‌వార్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌ల రేపుతున్నాయి.

Also Read : KTR TCL Global : హైద‌రాబాద్ లో టీసీఎల్ గ్లోబ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!