Amit Shah Ganguly : దాదాతో ట్రబుల్ షూటర్ భేటీ
బీజేపీలో చేరనున్నారా..
Amit Shah Ganguly : సౌరవ్ గంగూలీ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు భారత దేశంలో. ఎనర్జటిక్, డైనమిజం కలిగిన క్రికెటర్లలో గంగూలీ(Ganguly) ఒకరు. ఆయనను అంతా బెంగాలీ వాసులంతా ప్రిన్స్ అని పిలుచుకుంటారు.
అంతే కాదు దాదా అని ముద్దుగా పేర్కొంటారు కూడా. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చీఫ్ గా ఉన్నారు. త్వరలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) చైర్మన్ రేసులో పోటీ పడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన ఏకైక క్రికెట్ క్రీడా సంస్థగా బీసీసీఐకి పేరుంది. ఇక గంగూలీ వచ్చాక దాని స్వరూపమే మారి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే గంగూలీ అంటేనే ఓ రాజసం ఉట్టి పడుతుంది.
ఆ మధ్య ఎన్నికల కంటే ముందు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. బీజేపీలో చేరాలంటూ వత్తిళ్లు తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.
తాజాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) గంగూలీతో భేటీ కావడం చర్చకు దారి తీసింది.
ఆయన నివాసానికి షా స్వయంగా వెళ్లడం, భోజనం చేయడం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా గంగూలీకి సత్ సంబంధాలు ఉన్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలంటే, దీదీని ఎదుర్కోవాలంటే చరిష్మా ఉన్న నేత ఇప్పుడు బీజేపీకి గంగూలీ(Ganguly)మాత్రమే కనిపిస్తున్నాడు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పాగా వేసేలా పావులు కదుపుతున్నారు అమిత్ షా.
ఇదే సమయంలో ఆయన తనయుడు జే షా బీసీసీఐకి సెక్రటరీగా ఉన్నాడు. పైకి సాధారణ భేటీ అని చెపుతున్నా ట్రబుల్ షూటర్ ఎంటర్ అయ్యాడంటే ఏదో స్కెచ్ ఉండనే ఉంటుందన్నది ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్న మాట.
దాదాను దీదీకి పోటీగా ఫోకస్ చేయాలన్నది షా ప్లాన్. మరి వర్కవుట్ అవుతుందా చూడాలి.
Also Read : GT Vs MI IPL 2022 : ఉత్కంఠ పోరులో ముంబై విజయం