Amit Shah Meet : హర్యానా గవర్నర్ ను కలిసి కొత్తప్రభుత్వ ఏర్పాటుకు వినతులిచ్చిన షా, సైనీ

కాగా, హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ గురువారంనాడు బాధ్యతలు చేపట్టనున్నారు...

Amit Shah : హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో కొలువుతీరనుంది. ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీని రెండోసారి ముఖ్యమంత్రి కొనసాగించేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయించడం, ఇందుకు అనుగుణంగా బీజేపీ శాసనసభా పక్షం బుధవారం ఉదయం జరిపిన సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆ వెంటనే కేంద్ర పరిశీలకునిగా వెళ్లిన అమిత్‌షా(Amit Shah), నయబ్ సింగ్ సైనీ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ బండారు దత్తాత్రేయను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సైనీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సావిత్రి జిందాల్, దేవేంద్ర కడ్యాన్, రాజేష్ డూన్‌లు కూడా గవర్నర్‌ను కలిసిన బీజేపీ ప్రతినిధి బృందంలో ఉన్నారు.

Amit Shah Meet Governor..

దీనికి ముందు, పంచకులలో జరిగిన సమావేశంలో బీజేపీ శానసభా పక్ష నేతగా నయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ విజ్‌లు సీఎం అభ్యర్థిగా సైనీ పేరును ప్రతిపాదించగా, సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, హర్యానా ముఖ్యమంత్రిగా సైనీ గురువారంనాడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్క్‌ (46)ను సునాయాసంగా దాటేసింది. కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకే పరిమితమైంది.

Also Read : AP Free Sand : ఉచిత ఇసుక విషయంలో మంత్రులపై భగ్గుమన్న సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!