Pappal Preet Singh : అమృత పాల్ సింగ్ అనుచరుడు అరెస్ట్
పప్పల్ ప్రీత్ సింగ్ అదుపులోకి
Pappal Preet Singh : సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ వేర్పాటు వాద నాయకుడు అమృత్ పాల్ సింగ్ కు బిగ్ షాక్ తగిలింది. గత నెల మార్చి 18న పోలీసుల కళ్లు గప్పి పారి పోయాడు. త్వరలోనే బయటకు వస్తానంటూ ప్రకటించాడు. ఇదే సమయంలో ఏప్రిల్ 14న బైశాఖి ఫెస్టివల్ జరగనుంది పంజాబ్ లో.
ఇప్పటికే అమృత పాల్ సింగ్ వస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరో వైపు అమృత పాల్ సింగ్ సహాయకుడిగా పేరొందిన పప్పల్ ప్రీత్ సింగ్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లో అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్ పోలీసులతో పాటు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక టీం సంయుక్త ఆపరేషన్ కొనసాగింది. ఇందులో భాగంగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ లోని హోషియార్ పూర్ లో గుర్తించి పట్టుకుంది పప్పల్ ప్రీత్ సింగ్ ను(Pappal Preet Singh). గత నెలలో జలంధర్ పోలీసుల వల నుండి నాటకీయంగా తప్పించుకున్న తర్వాత ఇద్దరూ నిరంతరం కలిసి ఉన్నారు. వివిధ మార్గాలలో వెళ్లారు. సంయుక్త ఆపరేషన్ లో పట్టుబడడంతో అమృత పాల్ సింగ్ ను పట్టుకోవడం మరింత సులభంగా మారింది.
తప్పించుకున్న అమృత పాల్ సింగ్ ఈ నెలాఖరులో సిక్కులు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. భటిండాలో సర్బత్ ఖల్సా సమావేశం ఏర్పాటు చేసింది. ఖైసాఖీలో జరిగే సమావేశానికి ముందు అమృత సర్ లోని ఆకల్ తఖ్త్ నుండి భటిండాలోని దామ్ దామాదామా సాహిబ్ వరకు మత పరమైన ఊరేగింపును చేపట్టాలని పాల్ జరేదార్ లను కోరాడు.
Also Read : సత్య పాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్