Anand Mahindra : మిస్త్రీ మరణంపై మహీంద్రా కామెంట్స్
ఇక వెనుక సీటుకు కూడా బెల్ట్ ధరించాలేమో
Anand Mahindra : భారతీయ వ్యాపార దిగ్గజంగా పేరొందిన సైరస్ మిస్త్రీ ముంబై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మృతితో వ్యాపార రంగం తీవ్ర విషాదానికి లోనైంది.
ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). ఇది అత్యంత బాధాకరం. నేను కలలో కూడా అనుకోలేదు మిస్త్రీ కాలం చేస్తారని. కానీ కాలం ఎలా ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో చెప్పలేం.
ప్రస్తుతం బాధగా ఉంది. నాకు సన్నిహితుడు. ఎన్నో సార్లు కలుసుకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడు. అత్యంత పిన్న వయస్సులో ఉన్నత స్థానంలోకి వచ్చాడు.
తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉండేలా చేశాడని కితాబు ఇచ్చాడు. వెనుక సీటులో కూర్చున్న సైరన్ మిస్త్రీ చని పోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఇక ఇప్పటి నుంచి నేను ప్రయాణం చేస్తున్న కారులో వెనుక సీటుకు కూడా బెల్ట్ అన్నది తప్పక ధరించాలేమోనన్న నిజం బోధ పడిందన్నారు ఆనంద్ మహీంద్రా.
ఇక నుంచి ప్రతి ఒక్కరు వెనుక సీటులో బెల్టు ధరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దీని వల్ల చాలా ప్రమాదాల బారి నుంచి బయట పడతామని, జరిగినా వాటి నుంచి రక్షించు కునేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
సైరస్ మిస్త్రీ వెనుక సీటులో బెల్ట్ ధరించడ వల్ల ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుల విచారణలో తేలడం తనను మరింత ఆందోళనకు గురి చేసేలా చేసిందని పేర్కొన్నారు.
Also Read : మిస్త్రీ మరణం భారత్ కు తీరని నష్టం