Anand Mahindra : ప్ర‌జ్ఞానందకు మ‌హీంద్రా కారు గిఫ్ట్

చెస్ చాంపియ‌న్ షిప్ లో ర‌న్న‌ర‌ప్

Anand Mahindra : ప్ర‌ముఖ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త , మ‌హీంద్రా కంపెనీ సంస్థ‌ల చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భారత దేశంలోని త‌మిళ‌నాడుకు చెందిన చెస్ కింగ్ ఆర్. ప్ర‌జ్ఞానంద‌కు అరుదైన బ‌హుమ‌తి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు త‌న అపార‌మైన మేధో సంపత్తితో దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తీసుకు వ‌చ్చేలా చేసినందుకు ఆర్. ప్ర‌జ్ఞానంద‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

Anand Mahindra Good Support

తాజాగా వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ కోసం జ‌రిగిన పోటీలో చెన్నైకి చెందిన ఆర్. ప్ర‌జ్ఞానంద ర‌న్న‌రప్ గా నిలిచాడు. కొద్ది పాటి తేడాతో విజ‌యాన్ని ద‌క్కించు కోలేక పోయాడు. అయినా అత‌డు రియ‌ల్ విన్న‌ర్ అంటూ కొనియ‌డారు ఆనంద్ మ‌హీంద్రా.

ఈ దేశంలో ఎంతో మంది వ్యాపారులు , కార్పొరేట్ కంపెనీలు, చైర్మ‌న్లు, సీఈఓలు ఉన్నా ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) మాత్రం వెరీ వెరీ స్పెష‌ల్. ఎందుకంటే ఆయ‌న‌కు భార‌త దేశం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంత‌కు మించిన ప్రేమ‌, గౌర‌వం కూడా.

భార‌త దేశానికి చెందిన క్రీడాకారులు ఎవ‌రైనా స‌రే ఏ రంగంలో ఉన్నా స‌రే ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వ‌చ్చిన‌ట్లయితే వెంట‌నే స్పందిస్తారు. స‌పోర్ట్ చేస్తారు. వారికి అరుదైన బ‌హుమ‌తులు అంద‌జేతారు. చెస్ చాంఫియ‌న్ షిప్ లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన ఆర్. ప్ర‌జ్ఞానంద‌కు త‌మ కంపెనీకి చెందిన ఎక్స్యూవీ ఈవీ కారును బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : Nara Lokesh : మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వ‌ని ఏపీ స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!