Anand Mahindra Sunak : చర్చిల్ కామెంట్స్ తప్పని తేలింది
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎంపికపై కామెంట్స్
Anand Mahindra Sunak : భారతీయ ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఆయన చేసే ట్వీట్స్ , కామెంట్స్ , కోట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆనంద్ మహీంద్రాకు భారత దేశం అంటే వల్లమాలిన అభిమానం. ప్రత్యేకించి భారతీయులను ఎవరైనా కించ పరిచినా లేదా తూలనాడినా తట్టుకోలేరు.
వెంటనే ఘాటుగా స్పందిస్తారు. వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తారు. ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, వ్యాపార రంగాలలో భారత దేశానికి చెందిన వారు టాప్ లో కొనసాగుతున్నారు. టెక్నాలజీ పరంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల తో పాటు రాజకీయంగా అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలిగా ప్రవాస భారతీయురాలైన కమలా హారీస్ కొలువు తీరారు.
తాజాగా బ్రిటన్ లో భారతీయ మూలాలు కలిగిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి అల్లుడైన రిషి సునక్(Rishi Sunak) ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) స్పందించారు. రిషి సునక్ కు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఆనాటి బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి విన్ స్టన్ చర్చిల్ భారతీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు.
1947లో భారత్ కు స్వేచ్ఛ లభించిన వేళ ఇండియన్ లీడర్స్ తక్కువ స్థాయి కలిగి ఉంటారని పేర్కొన్నారు. నేడు రిషి సునక్ పీఎంగా కొలువు తీరడంతో అది తప్పని తేలిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : అక్షతా మూర్తి ..రిషి సునక్ సక్సెస్ సీక్రెట్