Anand Mahindra : ప్రియాంక న‌ట‌న‌కు మ‌హీంద్రా కితాబు

సిటాడెల్ లో న‌టించిన బ్యూటీ క్వీన్

Anand Mahindra : తాజాగా 68వ పుట్టిన రోజు జరుపుకున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సిటా డెల్ లో ప్రియాంక చోప్రా అద్భుతంగా న‌టించిందంటూ కితాబు ఇచ్చారు. పురుష హీరోలను మించి న‌టించింద‌ని మెచ్చుకున్నారు. తొలి వెబ్ సీరీస్ లో న‌టించింది ప్రియాంక చోప్రా. ర‌స్సో బ్ర‌ద‌ర్స్ ప్రొడక్ష‌న్ లో న‌దియా సీన్ పాత్ర పోషించినందుకు చోప్రాను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ఆనంద్ మ‌హీంద్రా. ఆయ‌న సామాన్యంగా ఎవ‌రినీ పొగ‌డ‌రు. కానీ ప్రియాంక న‌ట‌న త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని పేర్కొన‌డం విశేషం.

సిటా డెల్ ఓటీటీలో ప్ర‌సార‌మైంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌ట్టి ప‌డేలా చేసింద‌ని పేర్కొన్నారు ఆనంద్ మ‌హీంద్రా. ఒక న‌టిగా మ‌రో మెట్టుకు ఎదిగింది. మొద‌టి నుంచి స్వేచ్ఛ‌ను కోరుకుంది. ఆ దిశ‌గా అడుగులు వేసింది. ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ముందుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంది. ఇందుకు మిన‌హాయింపు ఏమీ ఉండ‌ద‌ని నేను అనుకుంటున్నాన‌ని తెలిపారు ఆనంద్ మ‌హీంద్రా. ఇదిలా ఉండ‌గా త‌న న‌ట‌నకు వ్యాపార వేత్త ఫిదా కావడంపై సంతోషం వ్య‌క్తం చేసింది ప్రియాంక చోప్రా(Priyanka Chopra).

ఇదిలా ఉండ‌గా సిటా డెల్ గ‌త ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. రాబోయే వారాల్లో మ‌రిన్ని ఎపిసోడ్ లు రానున్నాయి. గ‌తంలో బాలీవుడ్ లో న‌టించిన అనుభవం సిటా డెల్ లో న‌టించేందుకు దోహ‌ద ప‌డింద‌ని స్ప‌ష్టం చేసింది ప్రియాంక చోప్రా.

Also Read : పొన్నియ‌న్ సెల్వ‌న్ -2 క‌లెక్ష‌న్లు అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!