Anand Mahindra : సమయాన్నిపెట్టుబడి పెట్టండి – మహీంద్రా
ఝున్ ఝున్ వాలా ను గుర్తు చేసుకున్న వ్యాపారవేత్త
Anand Mahindra : భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మరో దిగ్గజ వ్యాపారవేత్త ఇటీవలే మరణించిన స్టాక్ కింగ్ మేకర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన జీవిత కాలంలో రూ. 5,000 పెట్టుబడితో కెరీర్ ప్రారంభించాడు ఇండియన్ వారెన్ బఫెట్. అత్యంత విలువైన సలహాని పంచుకున్నారు.
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ప్రతి ఆదివారం – సండే థాట్ – పేరుతో విలువైన సూత్రాలు, సలహాలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా రాకేష్ ఝున్ ఝున్ వాలా(Rakesh jhunjhun Wala) పేర్కొన్న కోట్ ను ప్రత్యేకంగా గుర్తు చేశారు.
ఆనంద్ మహీంద్రా విలువైన సలహాని పంచుకున్నారు. స్పూర్తి దాయకమైన, విద్యా సంబంధమైన , సమాచారం ఇచ్చేవి పంచుకుంటూ వస్తున్నారు ఆనంద్ మహీంద్రా. సదరు పారిశ్రామికవేత్త తన 9.5 మిలియన్ల మంది అనుచరులకు ప్రేరణాత్మక పోస్ట్ పంచుకున్నారు.
తన జీవితంలో చివరి దశలో రాకేశ్ ఝున్ ఝున్ వాలా అత్యంత విలువైన , లాభ దాయకమైన పెట్టుబడి సలహా ఇచ్చాడు.
ఇది బిలియన్ల విలువైన సలహా, ఉత్తమమైన భాగం. దీనికి మీ సమయాన్ని పెట్టుబడి పెట్టుబడి అవసరం. మీ డబ్బు కాదు అని పేర్కొన్నారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది మంది లైక్ లు చేశారు.
ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) చేసిన ట్వీట్ కు జనాదరణ లభిస్తోంది. రాకేష్ ఝున్ ఝున్ వాలా ఆగస్టు 14న మరణించారు. బహుళ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మూత్ర పిండాల వ్యాధితో మరణించారు.
బిలీయనీర్ పెట్టుబడిదారుడి మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా అచంచలమైన దేశ భక్తుడంటూ రాకేష్ ఝున్ ఝున్ వాలా కు కితాబు ఇచ్చారు.
Also Read : టాస్క్ తో టీఎస్‌ఎస్‌సీ ఒప్పందం