Andre Russell : రెచ్చి పోయిన ఆండ్రూ రస్సెల్
కోల్ కతా నైట్ రైడర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
Andre Russell : ఐపీఎల్ లీగ్ లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది నితీశ్ రాణా సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్. మరోసారి తనదైన శైలిలో రాణించాడు యూపీ కుర్రాడు రింకూ సింగ్. ఆఖరి బంతికి మ్యాజిక్ చేశాడు. అద్భుతమైన షాట్ తో ఫోర్ కొట్టి తన జట్టుకు గ్రాండ్ విక్టరీ సాధించేలా చేస్తే..మరో విధ్వంసకరమైన ఆటగాడిగా పేరు పొందిన ఆండ్రీ రస్సెల్(Andre Russell) ఎక్కడా తగ్గలేదు.
ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునేలా చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. అనంతరం 180 పరుగుల భారీ టార్గెట్ తో బరి లోకి దిగింది కోల్ కతా నైట్ రైడర్స్.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. కెప్టెన్ నితీశ్ రాణా దంచి కొట్టాడు. 38 బంతులు ఆడి 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 51 రన్స్ చేశాడు. జాసన్ రాయ్ 8 ఫోర్లతో 38 చేశాడు. ఇక రస్సెల్ దంచి కొట్టాడు. 23 బంతులు ఎదుర్కొని 42 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి.
రింకూ సింగ్ హీరోగా మారాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు ఇక సిక్సర్ తో 21 పరుగులు చేశాడు. చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాయింట్ల పట్టికలో కోల్ కతా నైట్ రైడర్స్ 5వ స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
Also Read : రింకూ కమాల్ పంజాబ్ ఢమాల్