Angelo Mathews : 100 టెస్టులు పూర్తి చేసిన మాథ్యూస్
అరుదైన ఘనత సాధించిన క్రికెటర్
Angelo Mathews : శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన ఘనత సాధించాడు. గాలే వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా 100 టెస్టుల మైలు రాయిని చేరుకున్నాడు.
దీంతో శ్రీలంక దేశం తరపున వంద టెస్టులు ఆడిన ఆరో క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఏంజెలో కంటే ముందు ఆ దేశం తరపున ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్టులు పూర్తి చేశారు.
వారిలో అత్యధికంగా ఆడిన క్రికెటర్లలో మహేళ జయవర్దనే ఉన్నాడు. తన కెరీర్ లో 149 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. మాజీ కెప్టెన్ , ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర 134 టెస్టులు పూర్తి చేశాడు.
ఇక ప్రపంచంలోనే టాప్ లెగ్ స్పిన్నర్ గా పేరొందిన ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టు మ్యాచ్ లు పూర్తి చేశారు. మరో స్టార్ పేసర్ గా పేరొందిన చమింద వాస్ 111 టెస్టులు ఆడితే మోస్ట్ పాపులర్ ఓపెనర్ గా పేరొందిన సనత్ జయసూర్య 110 టెస్టులు ఆడారు.
మొత్తంగా శ్రీలంక క్రికెట్ దిగ్గజాల సరసన తాజాగా ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) చేరాడు. వంద టెస్టులు ఆడిన క్రికెటర్ గా ఘనత సాధించాడు.
ఇదిలా ఉండగా మ్యాచ్ విషయానికి వస్తే రెండు టెస్టుల సీరీస్ లో పాకిస్తాన్ మొదటి టెస్టు మ్యాచ్ లో అనూహ్యంగా విజయం సాధించింది.
భారీ టార్గెట్ ను ఈజీగా ఛేదించింది. ఇక రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో మాథ్యూస్ 42 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఇప్పటి వరకు ఏంజెలో 13 సెంచరీలో 38 హాఫ్ సెంచరీలు చేశాడు.
మొత్తం 6,918 పరుగులు చేశాడు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా చూస్తే ఏడో ఆటగాడిగా నిలిచాడు.
Also Read : వెస్టిండీస్ తో టీమిండియా రె’ఢీ’