Anil Deshmukh : అనిల్ దేశ్ ముఖ్ కు బెయిల్ మంజూరు
సంబురాల్లో మునిగిన నాయకులు, ఫ్యాన్స్
Anil Deshmukh : మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ఊరల భించింది. ఆయనపై సీబీఐ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కేసు నమోదు చేసింది. ఒకటి కాదు ఏకంగా రూ. 100 కోట్ల మోసానికి పాల్పడినట్లు పేర్కొంది. ఆయనను 2021 నవంబర్ లో అరెస్ట్ చేసింది. ఆనాటి నుంచి ఎన్నిసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు.
కానీ ఉన్నట్టుండి బెయిల్ దొరకడంతో ఆనందానికి లోనయ్యారు అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh). మాజీ హోం మంత్రిగా , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడిగా పేరొందారు. కానీ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆరోపించారు. కావాలని ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనిల్ దేశ్ ముఖ్.
హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, పోలీసులను అడ్డం పెట్టుకుని కోట్లల్లో వసూళ్లకు పాల్పడ్డారంటూ ఉన్నతాధికారి ఆరోపించారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, కనీసం ఇంటి వద్ద ఉంటూ చూయించు కునేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ గత అక్టోబర్ 21న అనిల్ దేశ్ ముఖ్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేశారు.
విచారించిన కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో దీనిని సవాల్ చేస్తూ అనిల్ దేశ్ ముఖ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ముంబై రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సంబురాలలో మునిగి పోయారు ఆయన సహచరులు, పార్టీ నాయకులు, అభిమానులు.
Also Read : ఆకట్టుకున్న ‘అఖిలేష్..డింపుల్’