TS SAP Chairman Goud : శాప్ చైర్మ‌న్ గా ఆంజ‌నేయ గౌడ్

జోగులాంబ జిల్లాకు చెందిన వ్య‌క్తి

TS SAP Chairman Goud : క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి ఏదో ర‌కంగా సీఎం కేసీఆర్ ప్ర‌యారిటీ ఇస్తార‌నేది మ‌రోసారి తేలింది. ఇప్ప‌టికే ప‌లువురికి ఆయ‌న హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేర‌కు చాలా మందికి ప‌లు పోస్టుల‌ను అప్ప‌గించారు. త్వ‌ర‌లో మ‌రికొన్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇందులో భాగంగా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం కేసీఆర్. జోగులాంబ గ‌ద్వాల జిల్లా గ‌ట్టు మండ‌లం ఆలూరు ఊరుకు చెందిన సాధార‌ణ కుటుంబానికి చెందిన ఆంజ‌నేయ గౌడ్ కు(TS SAP Chairman Goud) ఊహించ‌ని ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న‌కు ఏకంగా తెలంగాణా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్ గా నియ‌మించారు.

ఈ మేర‌కు నియామ‌క ఉత్త‌ర్వుల‌ను అంద‌జేశారు ఆంజ‌నేయ గౌడ్ కు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నియామ‌క ప‌త్రాన్ని అందుకున్నారు ఈడిగ ఆంజ‌నేయ గౌడ్. సోమవారం మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎంను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు ఉన్న‌త ప‌ద‌వి క‌ట్ట‌బెట్టినందుకు సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

క‌ష్ట‌ప‌డిన వారికి త‌ప్ప‌కుండా గౌరవం, గుర్తింపు ల‌భిస్తుంద‌ని త‌న‌తో తేలింద‌న్నారు ఈడిగ ఆంజ‌నేయ గౌడ్. ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత 2016లో తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మిష‌న్ స‌భ్యుడ‌గా కూడా ఆంజ‌నేయ గౌడ్ సేవ‌లు అందించారు.

ఉస్మానియా విశ్వ విద్యాల‌యం నుంచి న్యాయ శాస్త్రంలో డాక్ట‌రేట్ పొందారు. త‌న‌కు స‌హ‌క‌రించిన మంత్రి కేటీఆర్ కు, జిల్లా మంత్రులు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ కు, నీళ్ల నిరంజ‌న్ రెడ్డికి, శాస‌న‌స‌భ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Also Read : ధ‌ర్నా ఉద్రిక్తం రేవంత్ రెడ్డి అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!