Anna Hazare : కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన సామాన్య కార్యకర్త ‘అన్నా హజారే’

సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అన్నా హజారే స్పందించడం ఇదే తొలిసారి కాదు...

Anna Hazare : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కేజ్రీవాల్ ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare) స్పందించారు. ఆదివారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో అన్నా హజారే విలేకర్లతో మాట్లాడుతూ… గతంలో కేజ్రీవాల్‌ను రాజకీయాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించానన్నారు. సమాజానికి సేవ చేయమని అతడిని కోరినట్లు తెలిపారు. తద్వారా మనస్సు సంతోషంతో నిండిపోతుందని కేజ్రీవాల్‌కు వివరించానని చెప్పారు. ఇదే అంశాన్ని కేజ్రీవాల్‌కు పలుమార్లు సూచించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ తన సూచనలను కేజ్రీవాల్(Arvind Kejriwal) అంతగా పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఈ రోజు జరగాల్సినది మాత్రం జరిగిపోయిందన్నారు. అయినా కేజ్రీవాల్ హృదయంలో ఏముందో తనకు ఎలా తెలుస్తుందంటూ? విలేకర్లను అన్నా హజారే ప్రశ్నించారు.

Anna Hazare Comment

సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అన్నా హజారే స్పందించడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. అంటే ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఈ అంశంపై అప్పుడే అన్నాహజారే(Anna Hazare) స్పందించిన విషయం విధితమే. కేజ్రీవాల్ అరెస్ట్‌తో తాను అప్‌సెట్ అయినట్లు తెలిపారు. మద్యం విధానాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌తోపాటు తాను పోరాటం చేశానన్నారు. ఆ క్రమంలో అతడితో కలిసి నిరసన గళం సైతం వినిపించానని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో తాను తీవ్రంగా అప్‌సెట్ అయ్యానన్నారు. కానీ కేజ్రీవాల్ సొంత అవసరాల కోసం అరెస్టయ్యారని అన్నా హజారే గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త అన్నాహజారే పై విధంగా స్పందించారు.

ఇక కేజ్రీవాల్ వారసులు ఎవరనే ఓ చర్చ సైతం ఊపందుకుంది. ఆ క్రమంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేరు వైరల్ అవుతుంది. అదీకాక న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025, ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఢిల్లీ పీఠం అధిష్టించేందుకు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

Also Read : Deputy CM Pawan : ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!