Annamalai : అమిత్ షా హిందీ వాదం అన్నామ‌లై ఆగ్ర‌హం

ట్ర‌బుల్ షూట‌ర్ కు త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ షాక్

Annamalai : కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఇంకా క‌ల‌క‌లం రేపుతున్నాయి. హిందీయేత‌ర రాష్ట్రాల‌న్నీ విధిగా ఇంగ్లీష్ లో కాకుండా హిందీలోనే మాట్లాడాల‌ని అమిత్ షా సెల‌విచ్చారు.

దీనిని త‌ప్ప‌నిస‌రి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, త‌దిత‌ర రాష్ట్రాల‌న్నీ అమిత్ షాపై నిప్పులు చెరుగుతున్నాయి.

ఇప్ప‌టికే త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏకంగా కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. మాపై మీ పెత్త‌నం ఏంటి అంటూ నిల‌దీశారు. ఇదే స‌మ‌యంలో క‌ర్నాట‌క మాజీ సీఎంలు సిద్ద‌రామ‌య్య‌, జేడీ కుమార స్వామి సైతం సీరియ‌స్ గా స్పందించారు.

ఇక ప్ర‌పంచ ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, భార‌తీయ సినీ సంగీత దిగ్గ‌జం అల్లా ర‌ఖా రెహ‌మాన్ ఏకంగా త‌మిళ క‌వి భార‌తీదాస‌న్ క‌వితా ఫంక్తుల్ని ఉద‌హ‌రిస్తూ ట్వీట్ చేశారు. త‌మిళ భాష తీయ‌ద‌నం మాకు అదే మూలం అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. ఈ త‌రుణంలో త‌మిళ‌నాడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన అన్నామ‌లై(Annamalai) నిప్పులు చెరిగారు. తాము ఎట్టి ప‌రిస్థితుల్లో హిందీని ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక ర‌కంగా అమిత్ షాకు ఇది బిగ్ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. బ‌ల‌వంతంగా రుద్దే ఏ భాష‌ను తాము స్వీక‌రించేందుకు సిద్దంగా లేమ‌న్నారు అన్నామ‌లై.

భాషాభిమానం, ఆత్మాభిమానం, ప్రాంతీయ అభిమానం ముందు పార్టీలు, ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఇక్క‌డ నాతో పాటు ఎవ‌రూ హిందీ మాట్లాడ‌రు. మేం భార‌తీయులం అని నిరూపించు కునేందుకు ఇప్పుడు మ‌రో భాష నేర్చు కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు అన్నామ‌లై.

Also Read : మంత్రుల‌కు షాక్ అధికారుల‌కు ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!