Anshu Jain EX CEO : డ్యుయిష్ బ్యాంక్ మాజీ సీఇఓ ఇక లేరు
క్యాన్సర్ తో 59 ఏళ్ల అన్షు జైన్ మృతి
Anshu Jain EX CEO : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన డ్యుయిష్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్యాంక్ (సిఇఓ) అన్షు జైన్ మృతి చెందారు. 59 ఏళ్ల వయస్సు కలిగిన జైన్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.
డ్యుయిష్ బ్యాంకు అభివృద్ధి చెందడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కంపెనీ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ల వ్యాపారాన్ని నిర్మించడంలో కృషి చేశారు.
ఈ విషయాన్ని డ్యుయిష్ బ్యాంక్ వెల్లడించింది. అన్షు జైన్ 2009లో డ్యుయిష్ బ్యాంక్ మేనేజ్ మెంట్ బోర్డుకు నియమితులయ్యారు. 2010 నుండి కార్పొరేట్ , ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ విభాగానికి బాధ్యత వహించారు.
2012 నుండి 2015 వరకు అన్షు జైన్ సిఇఓగా బ్యాంకుకు బాధ్యతలు చేపట్టారు. కంపెనీలు, సంస్థాగత పెట్టుబడిదారులతో గ్లోబల్ బిజినె్ లో డ్యుయిష్ బ్యాంక్ స్థానాన్ని విస్తరించడంలో అన్షు జైన్(Anshu Jain) ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు.
ఆయన సిఇఓగా వైదొలిగిన తర్వాత కూడా డ్యుయిష్ బ్యాంక్ విస్తరించేందుకు, బలపడేందుకు తీవ్రంగా శ్రమించారు. ఐరోపాకు ఆర్థిక కేంద్రంగా కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైనది.
అలెగ్జాండర్ వైనాంట్ట్స్ చైర్మన్ గా ప్రస్తుతం ఉన్నారు. తాజాగా క్రిష్టియన్ కుట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఈ సందర్భగా అన్షు జైన్ మృతిపై స్పందించారు.
అన్షుతో కలిసి పని చేసిన ఎవరైనా మేధో నైపుణ్యం కలిగిన ఉద్యేగ భరితమైన నాయకుడుగా పేర్కొన్నారు. ఆయన శక్తి, బ్యాంకు పట్ల విధేయత మనలో చాలా మందికి గొప్ప ముద్ర వేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
Also Read : భారత్ కు షాక్ చైనా నౌకకు లైన్ క్లియర్