Antonio Gutterres : ప్ర‌పంచాన్ని ఏకం చేస్తున్న యోగా

సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్రెస్

Antonio Gutterres : యోగా ప్ర‌పంచాన్ని ఏకం చేస్తోంద‌న్నారు ఐక్య రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్. ప్ర‌తి ఏటా జూన్ 21న ప్ర‌పంచ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం యోగా సెష‌న్ ను ఐక్య రాజ్య స‌మితిలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ప్ర‌స్తుతం యోగా వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతోంద‌న్నారు సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్. ఆయ‌న ట్విట్టర్ వేదిక‌గా వీడియో సందేశం పంపించారు. యోగా దినోత్స‌వం మ‌నంద‌రినీ మ‌రింత ద‌గ్గ‌ర చేసింద‌న్నారు.

విభ‌జించ బ‌డిన ప్ర‌పంచంలో యోగా ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల మందిని ఏకం చేసే సాధ‌నంగా మార‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. బ‌లం, సామ‌ర‌స్యం, శాంతికి మూలంగా మారడం శుభ ప‌రిణామమ‌ని పేర్కొన్నారు ఆంటోనియో గుటెర్రెస్(Antonio Gutterres). ఈ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌నం ఈ ఐక్యతా స్పూర్తిని స్వీక‌రించాల‌ని కోరారు. సామ‌ర‌స్యా పూర్వ‌క‌మైన ప్ర‌పంచాన్ని నిర్మించాల‌ని కోరుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశంలో ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీ 2014లో కొలువు తీరారు. ఆయ‌న కృషి మేర‌కు ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు. ఐక్య రాజ్య స‌మితిలో తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌గా 193 దేశాల‌కు గాను 173 దేశాల ప్ర‌తినిధులు యోగాకు జై కొట్టారు.

Also Read : Antonio Gutterres : ప్ర‌పంచాన్ని ఏకం చేస్తున్న యోగా

Leave A Reply

Your Email Id will not be published!