Anuj Rawat : ఐపీఎల్ 2022లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు సత్తా చాటుతూ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఓ వైపు సీనియర్లతో జూనియర్లు పోటీ పడుతున్నారు. అందుకే ఐపీఎల్ రిచ్ లీగ్ కు అంత పోటీ. ముంబై ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనూజ్ రావత్ (Anuj Rawat)దుమ్ము రేపాడు.
ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ఫ్రీగా షాట్స్ ఆడుతూ పోయాడు. ప్రపంచ క్రికెట్ లో టాప్ ప్లేయర్ గా ఉన్న విరాట్ కోహ్లీ సైతం మిన్నకుండి పోయాడు.
అతడికి సపోర్ట్ గా తను కూడా ను 48 పరుగులతో రాణించాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. తను కెప్టెన్ గా రిజైన్ చేశాక ఆర్సీబీకి డుప్లెసిస్ సారథ్యం వహిస్తున్నాడు.
ఇక ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు అనూజ్ రావత్ . 47 బంతులు ఎదుర్కొన్న రావత్ 2 ఫోర్లు 6 సిక్సర్లతో మోత మోగించాడు. ఇక కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు 80 రన్స్ జోడించారు.
1999 అక్టోబర్ 17న పుట్టాడు రావత్. అతడి వయసు 22 ఏళ్లు. ఎడమ చేతి బ్యాటర్. వికెట్ కీపర్ కూడా. 2017 నుంచి 2020కి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.
గత ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రావత్ (Anuj Rawat)ను చేజిక్కించుకుంది. మొత్తం 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 528 రన్స్ చేశాడు.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు