Anurag Thakur Chiranjeevi : చిరు..నాగ్ తో అనురాగ్ భేటీ

కీల‌క అంశాల‌పై చ‌ర్చ

Anurag Thakur Chiranjeevi Nag : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రస్తుతం రాజకీయ రంగం సినీ రంగానితో చెట్టా ప‌ట్టాల్ వేసుకుని ప‌రుగులు తీస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. అంత‌కు ముందు మ‌రో పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో కూడా క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాజాగా కేంద్ర స‌మాచార, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ తెలంగాణకు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌నే స్వ‌యంగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్క‌డ నిర్మాత అల్లు అర‌వింద్ తో పాటు మ‌రో ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు చిరంజీవి అండ్ టీం. అనంత‌రం త‌న నివాసంలో కేంద్ర మంత్రిని(Anurag Thakur Chiranjeevi ) ఘ‌నంగా స‌న్మానించారు. అనురాగ్ ఠాకూర్ కు శాలువా కప్పారు. గుర్తుగా ఉండేందుకు వినాయ‌కుడి విగ్ర‌హాన్ని అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా చాలా సంతోషం వ్య‌క్తం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). సినీ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా పేరొందిన మెగాస్టార్, నాగ్, అల్లు అర‌వింద్ ల‌ను క‌ల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీగా ఉన్నారు. మ‌రికొంద‌రి ప్ర‌ముఖుల‌తో కూడా క‌లిశారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప‌లు విష‌యాల గురించి అనురాగ్ ఠాకూర్ తో చ‌ర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను మెగాస్టార్ చిరంజీవి పంచుకున్నారు.

Also Read : డైరెక్ట‌ర్ జోసెఫ్ మ‌ను జేమ్స్ క‌న్నుమూత

Leave A Reply

Your Email Id will not be published!