Anurag Thakur : న్యాయ ప్రక్రియ తర్వాత నిర్ణయం
నోరు విప్పిన అనురాగ్ ఠాకూర్
Anurag Thakur : దేశం యావత్తు మహిళా మల్ల యోధుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పడుతోంది. ఈ తరుణంలో న్యాయం చేయాల్సిన క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ఆ మధ్యన ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉండి పోయారు. తాజాగా రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము సాధించిన పతకాలను హరిద్వార్ లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది వారి నిర్ణయం. విషయం తెలుసుకున్న సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు నరేష్ టికాయత్ గంగా నది వద్దకు చేరుకున్నారు.
మహిళా రెజ్లర్లను సముదాయించారు. ఐదు రోజులు కేంద్రానికి డెడ్ లైన్ విధిస్తున్నామని ఆ లోపు సమస్యకు పరిష్కారం చూపక పోతే, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోక పోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో సమస్య ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా మహిళా రెజ్లర్ల పట్ల ఢిల్లీ ఖాకీలు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.
ఈ మొత్తం వ్యవహారంపై శుక్రవారం స్పందించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు. న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాత రెజ్లర్లకు న్యాయం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి చెందిన మహారాష్ట్ర మహిళా ఎంపీ ప్రీతి షిండే సంచలన కామెంట్స్ చేశారు. తాను చలించి పోయానని చెప్పారు. ఏ పార్టీకి చెందిన వారైతేనేం ముందు చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : CM Hemant Soren