Gautam Gambhir : హాంకాంగ్ పై ఎవ‌రైనా ఆడ‌తారు – గంభీర్

కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గొప్ప‌ద‌ని అన‌లేం

Gautam Gambhir :  మాజీ భార‌త క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2022లో భాగంగా భార‌త్, హాంకాంగ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా 192 ర‌న్స్ చేసింది 2 వికెట్లు కోల్పోయి. సూర్య కుమార్ యాద‌వ్ దుమ్ము రేపాడు. 26 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు కొట్టాడు. 68 ప‌రుగులు చేశాడు.

గ‌త కొంత కాలంగా పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ర‌న్ మెషీన్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. 59 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. మాజీ క్రికెట‌ర్లు కోహ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడంటూ కితాబు ఇవ్వ‌గా వారికి భిన్నంగా స్పందించాడు గౌతం గంభీర్(Gautam Gambhir).

కోహ్లీ చేసిన ర‌న్స్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌న్నాడు. విచిత్రం ఏమిటంటే ద‌మ్మున్న జ‌ట్టుతో ఆడితే ఒప్పుకోవ‌చ్చ‌ని కానీ హాంకాంగ్ లాంటి జ‌ట్టుతో ఆడ‌డం ఎవ‌రైనా ఆడ‌తారంటూ ఎద్దేవా చేశాడు.

ఇదే స‌మ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆశించిన మేర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక పోవ‌డంపై కూడా ప్ర‌స్తావించాడు. ఇప్ప‌ట్లో ఓ అంచ‌నాకు రావ‌డం స‌రైన‌ది కాదన్నాడు కోహ్లీ విష‌యంలో.

కొత్త ప్లేయ‌ర్లు కూడా ఇలాంటి ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటున్నార‌ని కోహ్లీ మ‌రింత ఫోక‌స్ పెడితే బాగుంటుంద‌ని సూచించాడు గౌతం గంభీర్. మొత్తంగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీశాయి.

Also Read : మెరిసిన ముద్దుగుమ్మ‌ ‘వాజ్మా’ సూప‌ర‌మ్మా

Leave A Reply

Your Email Id will not be published!