AP ACB Court : బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు
ఏపీ సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశం
AP ACB Court : విజయవాడ – ఏపీ ఏసీబీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించ వద్దంటూ స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు చేయాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. రూ. 371 కోట్లు షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో చేతులు మారాయని ఆరోపించింది ఏపీ సీఐడీ. 10 గంటల పాటు సీఐడీ విచారించింది.
AP ACB Court Comment
అక్కడి నుంచి ఏసీబీ కోర్టుకు నారా చంద్రబాబు నాయుడును(Chandrababu Naidu) హాజరు పరిచారు. బాబు తరపున వెంకటేశ్వర్ రావు, సిద్దార్త్ లూత్రా వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఆరున్నర గంటల విచారణ అనంతరం చంద్రబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోర్టు.
చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న మరో రెండు రోజులు పొడిగించింది. ఏపీ స్కిల్ స్కాంకు సంబంధించి రెండో రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. మరో వైపు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ , బెయిల్ పిటిషన్ లను కొట్టి వేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read : Sachin Tendulkar : మోదీకి నమో జెర్సీ బహూకరణ