AP CID : లోకేష్ కు సీఐడీ బిగ్ షాక్
మరో పిటిషన్ దాఖలు
AP CID : విజయవాడ – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ తగిలింది. తను రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో తండ్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి బిగ్ స్కామ్ కు పాల్పడ్డాడంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు మాజీ సీఎం చంద్రబాబుపై ఏకంగా 8 కేసులు నమోదు చేసింది.
AP CID Shock to Nara Lokesh
తాజాగా నారా లోకేష్ కు షాక్ ఇస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ(AP CID) మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని ఆరోపించింది.
సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా పత్రికల క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది.
41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉండదని పిటిషన్లో సీఐడీ పేర్కొంది. వెంటనే లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
Also Read : Mansoor Ali Khan : నటుడు మన్సూర్ కు జరిమానా