DSP Sudhakar Reddy : సుధాక‌ర్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడ‌ల్

అంద‌జేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

DSP Sudhakar Reddy : ఏపీ పోలీస్ శాఖ‌లో విశిష్ట సేవ‌లు అందించిన ప‌ల‌మ‌నేరు డీఎస్పీ సుధాక‌ర్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడ‌ల్ ను బ‌హూక‌రించారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). 77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఈ మెడ‌ల్ ను అంద‌జేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో, అసాంఘిక శ‌క్తుల‌ను అణిచి వేయ‌డంలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు సుధాక‌ర్ రెడ్డి.

DSP Sudhakar Reddy Got Appreciation

ఎస్. సుధాక‌ర్ రెడ్డి 1992లో పోలీస్ శాఖ‌లో ఎస్ఐగా చేరారు. 31 ఏళ్ల పాటు ఎన్నో అవార్డులు, సేవా ప‌త‌కాలు సాధించారు. 2010లో ఏపీ పోలీస్ సేవా ప‌థ‌కం పొందారు. 2016లో ఉత్త‌మ సేవా ప‌థ‌కం అందుకున్నారు . 2012లో ఇండియ‌న్ పోలీస్ మెడ‌ల్ , 2021లో ప్రెసిడెంట్ మెడ‌ల్ ను పొందారు. సంచ‌ల‌నాత్మ‌కమైన కేసుల‌ను ఛేదించ‌డంలో , వాటిని రిక‌వ‌రీ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు డీఎస్పీ. హౌస్ బ్రేకింగ్ కేసులో రూ. 3.14 కోట్ల ఆస్తిని రిక‌వ‌రీ చేసినందుకు గాను సుధాక‌ర్ రెడ్డికి ఏబీసీడీ అవార్డు ద‌క్కింది. ప‌లు ప్రాంతాల‌లో రూ. 73 ల‌క్ష‌ల‌కు పైగా ఆస్తిని రిక‌వ‌రీ చేశారు.

ఐటీ మోస‌గాళ్ల‌ను ప‌ట్టుకుని కోటి రూపాయ‌ల విలువైన వ‌స్తువుల‌ను రిక‌వ‌రీ చేశారు. కోటి విలువైన మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు స‌బ్ డివిజ‌న్ లో 1.6 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, 3 కార్లు, 6 మోటారు సైకిళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు సుధాక‌ర్ రెడ్డి. అంత‌ర్ రాష్ట్ర నేర‌స్తులు శ‌క్తి వేల్ , క‌రుపు మురుగ‌, సుధాక‌ర్, తిరుప‌తి ముఠాల‌ను అరెస్ట్ చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ర‌. 5 కోట్ల విలువైన 10 ట‌న్నుల ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : CM KCR : రైత‌న్న‌ల‌కు కేసీఆర్ కానుక‌

Leave A Reply

Your Email Id will not be published!