AP CM YS Jagan : ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ

శ్రీ‌కారం చుట్టిన ఏపీ సీఎం

AP CM YS Jagan :  అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీకి శ్రీ‌కారం చుట్టారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సోమ‌వారం తాడేప‌ల్లి గూడెం క్యాంపు ఆఫీసులో సీఎం ప్రారంభించారు. ఇక నుంచి ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచితంగా వైద్యం అందుతుంద‌న్నారు. దీని వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండ బోవంటూ స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం.

AP CM YS Jagan Arogyasri Cards Distribution

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం జ‌రిగింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). ఆరోగ్య శ్రీ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. ఆరోగ్య శ్రీ లాంటి ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేద‌న్నారు.

తెలంగాణ‌లో కేవ‌లం రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం కొలువు తీరిన కొత్త స‌ర్కార్ శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. కానీ ఏపీలో మాత్రం భారీ ఎత్తున ఖ‌ర్చు ప‌రిమితిని పెంచ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

పేద‌ల‌తో పాటు ఇత‌ర ఉన్న‌త వ‌ర్గాల్లోని పేద‌ల‌కు కూడా ఆరోగ్య శ్రీ వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు . దీనిని ప్ర‌తి ఒక్క‌రు ఉప‌యోగించు కోవాల‌ని సూచించారు. ఇదిలా ఉండ‌గా వైద్యం కోసం అయ్యే ఖ‌ర్చుల‌కు సంబంధించి భారీ ఎత్తున పెంచ‌డంపై ఏపీ ప్ర‌భుత్వానికి, పెంచిన సీఎం జ‌గ‌న్ రెడ్డికి ప‌లువురు పేద కుటుంబాలు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : TPCC PAC Meeting : ప‌ట్టం క‌ట్టిన ప్ర‌జ‌ల‌కు థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!