AP CM YS Jagan : తీవ్ర వాదంపై ఉక్కు పాదం

ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : న్యూఢిల్లీ – ఏపీలో గ‌డిచిన నాలుగు ద‌శాబ్దాలుగా వామ‌ప‌క్ష తీవ్ర‌వాద స‌మ‌స్య‌పై పోరాడుతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ ప్రాంతంలో జాతీయ విధానం , కార్యాచ‌ర‌ణ ప్రణాళిక ప్ర‌కారం తీసుకున్న చ‌ర్య‌లు, అమ‌లు చేసిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు, స్థానిక ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ వంటి బ‌హుముఖ విధానం సానుకూల ఫ‌లితాల‌ను అందిస్తోంద‌న్నారు సీఎం.

AP CM YS Jagan Comment

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మ‌ద్ద‌తుతో ఏపీలో తీవ్ర‌వాద స‌మ‌స్య‌ను స‌మ‌ర్థ‌వంతంగ‌గా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. తాము అనుస‌రించిన వ్యూహాల వ‌ల్ల రాష్ట్రంలో వామ‌ప‌క్ష తీవ్ర వాద హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని చెప్పారు.

గ‌తంలో 5 జిల్లాల్లో మావోయిస్టు కార్య‌క‌లాపాలు ఉండేవ‌ని కానీ ఇప్పుడు తగ్గుముఖం ప‌ట్టాయ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan). గ‌తంలో 150 నుంచి నేడు 50కి త‌గ్గాయ‌ని తెలిపారు. ఒడిశా, తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో ఏపీ స‌హ‌కారం తీసుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే జాయింట్ టాస్క్ ఫోర్స్ ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు జ‌గ‌న్ రెడ్డి.

స్ధిరమైన అభివృద్ది, సామాజిక, ఆర్ధిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని తాను ధృఢంగా విశ్వసిస్తున్న‌ట్లు తెలిపారు ఏపీ సీఎం. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం, సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలని పేర్కొన్నారు. సమర్ధవంతమైన విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలమ‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : Pallam Raju : విశాఖ ఉక్కు ఏపీ హ‌క్కు

Leave A Reply

Your Email Id will not be published!