Pallam Raju : కడప – మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు విశాఖ ఉక్కు పరిశ్రమ ఊరికే రాలేదని, ఎందరో ఆంధ్రులు బలిదానం చేసుకుంటే ఏర్పాటైందన్నారు. ఏపీ విభజన చట్టం లోని హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Pallam Raju Comment about Vizag Steel Plant
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు లోపాయికారీగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి మంగళం పాడడం ఖాయమన్నారు. రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు పల్లంరాజు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో పత్రికలపై దాడులు, సీబీఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయడం బాధాకరమన్నారు పల్లంరాజు(Pallam Raju). ప్రజాస్వామ్యాన్ని , ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థను కూడా పక్కదారి పట్టించేందుకు మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు.
Also Read : Congress Win : తెలంగాణలో హస్తం హవా
