Congress Win : హైదరాబాద్ – తెలంగాణలో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ప్రముఖ సర్వే సంస్థ లోక్ పోల్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో గత ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గ్రౌండ్ సర్వే చేపట్టామని తెలిపింది. ప్రీ పోల్ సర్వే ఫలితాలను ముందస్తుగా వివరాలు వెల్లడిస్తున్నట్లు లోక్ పోల్ వెల్లడించింది.
Congress Win Survey Viral
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారంలో ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి 45 నుంచి 51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీకి సంబంధించి 61 నుంచి 67 సీట్లు రానున్నట్లు తెలిపింది.
ఇక హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎంఐఎం కు 6 నుంచి 8 సీట్లు వస్తాయని, కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 3 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది లోక్ పోల్ సర్వే సంస్థ. ఇండిపెండెంట్లు ఒక సీటు రానుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా తాజాగా లోక్ పోల్ సర్వే ముందస్తు ఫలితాలు వెల్లడించడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీలో గుబులు రేపుతోంది. ప్రధానంగా కీలకమైన నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతుండడం విశేషం.
Also Read : Revanth Reddy : కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకే
