Revanth Reddy : కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకే
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు.
Revanth Reddy Shocking Comments
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం విడి పోయిన సమయంలో మిగులు బడ్జెట్ తో తెలంగాణకు అప్పగించడం జరిగిందన్నారు. కానీ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నదే కాకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని స్పష్టం చేశాయని, తాము పవర్ లోకి వచ్చిన వెంటనే కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసి, జైలులో పెడతామని ప్రకటించారు.
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే కాక అమలుకు నోచుకోని హామీలతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Home Minister Slaps : చేయి చేసుకున్న హోం మినిష్టర్
