Home Minister Slaps : చేయి చేసుకున్న హోం మినిష్ట‌ర్

మ‌హ‌మూద్ అలీ కండ కావ‌రం

Home Minister Slaps : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీకి(Mohammad Ali) కోపం వ‌చ్చింది. శుక్ర‌వారం మ‌రో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా మంత్రికి శుభాకాంక్ష‌లు తెలిపేందుకు వ‌చ్చిన మ‌హమూద్ అలీ కంగ్రాట్స్ తెలిపారు. ఇదే స‌మ‌యంలో స‌హ‌చ‌ర మంత్రికి బొకేను ఇవ్వ‌మంటూ సెక్యూరిటీ ఆఫీస‌ర్ ను కోరారు.

Home Minister Slaps Security

బొకే ఇవ్వ‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. దీంతో కోపంతో ఊగి పోయారు. అంద‌రి ముందే త‌న భ‌ద్ర‌తా అధికారిపై చేయి చేసుకున్నారు. చెంప ఛెళ్లుమ‌నిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అధికారం ఉంది క‌దా అనే మ‌దంతో , స‌భ్య‌త‌, సంస్కారం మ‌రిచి పోయిన హోం శాఖ మంత్రి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రుల ప‌నితీరు బాగా లేదు. ప్ర‌త్యేకించి క‌బ్జాలు, దాడులు చేయ‌డం, బెదిరించ‌డం , త‌దిత‌ర వాటిపై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

తాజాగా మ‌హ‌మూద్ అలీ ఘ‌ట‌న ఇప్పుడు రాచ‌రిక పాల‌న‌కు అద్దం ప‌డుతోంది. ఆ మ‌ధ్య‌న హోం శాఖ మంత్రి మ‌నువ‌డి నిర్వాకం కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై పోలీసు శాఖ ఏం చేస్తుంద‌నేది వేచి చూడాలి.

Also Read : Dial Your TTD EO : 15 నుండి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Leave A Reply

Your Email Id will not be published!