AP CM YS Jagan : ఆరోగ్య శ్రీ ప‌థ‌కం పేద‌ల‌కు వ‌రం

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

AP CM YS Jagan : అమ‌రావ‌తి – రాష్ట్రంలో ఏ ఒక్క‌రు కూడా వైద్యానికి ఇబ్బంది ప‌డ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan). సోమ‌వారం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల వారికి మేలు చేకూర్చేలా వైద్య సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

AP CM YS Jagan Comment

రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క పేద‌వాడు కూడా వైద్యం కోసం అప్పులు చేయాల్సి రాకూడ‌ద‌న్నారు. అదే త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అప్పులు చేయ‌కుండా కేవ‌లం ప్ర‌భుత్వ ప‌రంగా అంద‌జేసే సాయాన్ని పొందాల‌ని చెప్పారు. ఇందు కోసం వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.

ఎలాంటి వ్యాధుల‌కైనా ఖ‌ర్చు లేకుండానే వైద్య స‌దుపాయం అందించేలా ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు . దీనిని ప్ర‌తి ఒక్క‌రు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు సీఎం. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా అందిస్తున్న సేవ‌ల‌కు సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక సాయాన్ని అద‌నంగా మ‌రికొంత పెంచ‌డం జ‌రిగింద‌ని తెలిపారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఇందులో భాగంగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 ల‌క్ష‌ల‌కు పెంచిన‌ట్లు చెప్పారు ఏపీ సీఎం. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తి పేద కుటుంబం ఉప‌యోగించు కోవాల‌ని పిలుపునిచ్చారు. ఒక‌వేళ ఏ ఆస్ప‌త్రి అయినా లేదా ఎవ‌రైనా స‌రే వైద్యానికి నిరాక‌రిస్తే వెంట‌నే త‌న‌కు కాల్ చేయాల‌ని అన్నారు.

Also Read : VC Sajjanar : బ‌స్సులను ధ్వంసం చేస్తే ఊరుకోం

Leave A Reply

Your Email Id will not be published!