AP CM YS Jagan Reddy : టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్ల స్థ‌లాలు

45 రోజుల్లో అంద‌రికీ ఇస్తామ‌న్న సీఎం

AP CM YS Jagan Reddy : తిరుప‌తి – ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది చారిత్రిక నిర్ణ‌య‌మ‌న్నారు. ప్ర‌స్తుతానికి 3,518 మంది ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాలు పంపిణీ చేశామ‌ని మిగ‌తా 45 రోజుల్లో ప్ర‌తి ఒక్క ఉద్యోగికీ ఇంటి స్థ‌లాన్ని ఇస్తామ‌ని వెల్ల‌డించారు జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan).

AP CM YS Jagan Reddy Distributed House Pattas

శ్రీ‌నివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో హాస్ట‌ల్ బ్లాక్ ల‌ను సీఎం ప్రారంభించి ప్ర‌సంగించారు. ఇది ద‌శాబ్దాల నుంచి క‌ల‌గా మిగిలి పోయింద‌ని, దానిని తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక నిజం చేశామ‌న్నారు ఏపీ సీఎం.

ర‌. 650.50 కోట్ల‌తో 7 కిలోమీట‌ర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవ‌ర్ తిరుప‌తి ఆధ్యాత్మిక న‌గ‌రానికి ఆభ‌ర‌ణం లాంటిద‌ని చెప్పారు. దీని వ‌ల్ల ప్ర‌యాణీకుల క‌ష్టాలు తొల‌గి పోతాయ‌ని, యాత్రికుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని, సులువుగా తిరుమ‌ల‌కు చేరుకుంటార‌ని తెలిపారు.

వ‌డ‌మాల‌పేట మండ‌లం పాదిరేడు గ్రామ స‌మీపంలో రాష్ట్ర స‌ర్కార్ 300 ఎక‌రాల భూమిని ఇళ్ల స్థ‌లాల కోసం కేటాయించామ‌ని ఇది చారిత్రిక ఘ‌ట్ట‌మ‌న్నారు. మొత్తం 6,700 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నార‌ని ప్ర‌స్తుతం రూ. 313 కోట్ల ఖ‌ర్చుతో 3,518 మందికి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు పంపిణీ చేశామ‌న్నారు. మిగిలిన వారికి కూడా త్వ‌ర‌లోనే ఇస్తామ‌న్నారు.

Also Read : AP CM YS Jagan : శ్రీ‌వారికి సీఎం ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!