AP CM YS Jagan Review : రైతుల ధాన్యానికి మ‌ద్ద‌తు ధ‌ర

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్

AP CM YS Jagan Review : తాడేప‌ల్లి గూడెం – రైతులు పండించిన ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చూడాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) ఆదేశించారు. ఇవాళ త‌న క్యాంపు ఆఫీసులో వ్య‌వ‌సాయ రంగంపై స‌మీక్షించారు. రైతులు ఎక్క‌డా ఇబ్బందుల‌కు లోను కాకూడ‌ద‌న్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు సీఎం.

AP CM YS Jagan Review For grains

ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌డంతో జీఎల్టీ రూపంలో క్వింటాలుకు సుమారు రూ. 250కి పైగానే అద‌నంగా ల‌భిస్తోంద‌ని చెప్పారు. విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో మేలు చేస్తున్నామ‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే స‌మ‌యంలో మేలు జ‌ర‌గాల‌న్నారు. మిల్ల‌ర్లు, మ‌ధ్య వ‌ర్తుల ప్ర‌మేయం సాధ్య‌మైనంత మేర త‌గ్గించాల‌ని ఆదేశించారు సీఎం జ‌గ‌న్ రెడ్డి.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రైతులు మిల్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ధాన్యంతో పాటు , చిరు ధాన్యాల‌ను సైతం కొనుగోలు చేయాల‌ని ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల‌ను ఉప‌యోగించు కోవాల‌ని , మిల్లెట్ల‌ను ప్రాసెస్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి.

పీడీఎస్ ద్వారా మిల్లెట్ల‌ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని పేర్కొన్నారు. ఈ ఏడాది రెండో విడ‌త రైతు భ‌రోసాకు సిద్దం కావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఔత్సాహికులైన వారికి డ్రోన్ల‌పై శిక్ష‌ణ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Indian Embassy : భార‌తీయుల కోసం హెల్ప్ లైన్లు

Leave A Reply

Your Email Id will not be published!