AP CM YS Jagan : కృష్ణా జ‌లాల‌పై జ‌గ‌న్ స‌మీక్ష‌

పాల్గొన్న మంత్రి అంబ‌టి రాంబాబు

AP CM YS Jagan : అమ‌రావ‌తి – కృష్ణా జలాల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశానికి నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు హాజ‌ర‌య్యారు. ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శి భూష‌ణ్ కుమార్ , ఈఎన్ సీ నారాయ‌ణ రెడ్డి పాల్గొన్నారు.

AP CM YS Jagan Meeting

కేంద్రంలో కొలువు తీరిన మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ , సంకీర్ణ ప్ర‌భుత్వం త‌మ‌తో సంప్ర‌దించ‌కుండా మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌ను మిన‌హాయించ‌డంపై చ‌ర్చ‌కు వ‌చ్చింది. నీటి పారుద‌ల , ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, ప్రాజెక్టుల ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప్ర‌స్తావించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan).

ఢిల్లీలో ప‌ర్య‌టించారు ఏపీ సీఎం. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి పెంచిన అంచ‌నాల మేర‌కు నిధుల‌ను త్వ‌రిత‌గ‌తిన మంజూరు చేయాల‌ని విన్న‌వించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో పార్టీ ప‌రంగా ఇచ్చిన హామీలు ఎంత వ‌ర‌కు అమ‌లు చేశామ‌న్న‌ది ముఖ్య‌మ‌న్నారు సీఎం.

Also Read : Minister KTR : గులాబీదే విజ‌యం కేసీఆరే సీఎం

Leave A Reply

Your Email Id will not be published!