AP CM YS Jagan : మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన
AP CM YS Jagan : విజయవాడ – మైనార్టీల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
AP CM YS Jagan Comment
తమ ప్రయత్నం అంతా వారు కూడా ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలని కృషి చేస్తున్నామని తెలిపారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). దేశంలో ఎక్కడా లేని రీతిలో పథకాలు, కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా ప్రధానంగా, విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చేశానని తెలిపారు.
ఇవాళ ఏ కష్టం వచ్చినా ఆస్పత్రిలో చూయించుకునే సౌలభ్యం ఉందన్నారు. అంతే కాకుండా నాడు నేడు కింద పాఠశాలలను తీర్చి దిద్దామని, మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే మైనార్టీల బాగు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తానని ప్రకటించారు.
డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల పట్ల సీఎం జగన్ చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
Also Read : Minister KTR : కొలువుల కల్పనలో తెలంగాణ టాప్
