AP CM YS Jagan : ప్రపంచంతో మనం పోటీ పడాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం జగన్
AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంతో రాష్ట్ర విద్యార్థులు పోటీ పడేలా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ బడులు, ఇంటర్ లో విద్యపై ఐబీ సిలబస్ పై సమావేశంలో చర్చించారు. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు సీఎం(AP CM YS Jagan). విద్యా బోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ముందుగా విస్తృతంగా అధ్యయనం చేయాలని అన్నారు.
AP CM YS Jagan Focus on Education
విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా , విద్యా వ్యవస్థ అవసరాలను , విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు ఏపీ సీఎం. ఇందుకు గాను టీచర్ల సమర్థతలను పెంచడం, సజావుగా వారు బోధించేలా అన్న దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు జగన్ రెడ్డి. ఇక ఉన్నత విద్య టీచింగ్ , లెర్నింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎంకు ఉన్నతాధికారులు ఏఐ వినియోగంపై వివరించే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు కోర్సు పూర్తయిన తర్వాత చివరగా ఏఐకి సంబంధించి ప్రాథమిక అంశాలపై బోధించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏఐపై పరిశోధన కోసం యూనివర్శిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోధన, పరిశోధన, అసెస్ మెంట్ లో ఏఐ టూల్స్ వినియోగించేలా చూస్తున్నామని సీఎంకు వెల్లడించారు. బైలింగువల్ , డిజిటల్ కంటెంట్ రూపంలో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.
Also Read : Chevireddy Mohit Reddy : తుడా చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి