AP CM YS Jagan : ఆగస్టు 9 ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అడవి బిడ్డలకు, గిరి పుత్రులకు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అడవి బిడ్డలకు ఆసరాగా ఉంటూ వచ్చామన్నారు. ప్రపంచం ఎంతో అభివృద్ది చెందుతున్నా ఇంకా గిరి పుత్రులు మాత్రం అమ్మలా భావిస్తున్న అడవులపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు ఏపీ సీఎం.
AP CM YS Jagan addressed the Tribals
నిత్యం ప్రకృతి మాతను కాపాడుతున్నారని, వారి సంక్షేమానికి పెద్ద పీట వేశామని స్పష్టం చేశారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). ప్రత్యేకించి అడవి బిడ్డల కోసం వివిధ కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం వంటి సదుపాయాలను కల్పించడం జరిగిందని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి.
అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా వేలాది మంది గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించడం జరిగిందని ఇది ఏ రాష్ట్రంలో చేపట్టలేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం. అంతే కాకుండా గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చామన్నారు. కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జగన్ మోహన్ రెడ్డి. ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు.
Also Read : Rahul Flying Kiss : రాహుల్ ఫ్లయింగ్ కిస్ పై రభస