Rahul Flying Kiss : రాహుల్ ఫ్లయింగ్ కిస్ పై రభస
ఇచ్చారంటూ స్మృతీ ఇరానీ ఫైర్
Rahul Flying Kiss : రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిప్పులు చెరిగారు. బుధవారం లోక్ సభలో గందర గోళం నెలకొంది. రాహుల్ తన స్పీచ్ ముగించుకుని వెళ్లే సమయంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని సభ సాక్షిగా ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి వ్యవహారం కలిగిన వ్యక్తిని ఎక్కడా చూడలేదని అన్నారు ఇరానీ.
Rahul Flying Kiss Viral
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు కేంద్ర మంత్రి. నిరభ్యంతర తీర్మానంపై ప్రసంగిస్తున్న సమయంలో స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేను సభలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యాను. రాహుల్(Rahul Gandhi) సభ నుంచి బయటకు వెళ్లే సమయంలో అవమానకర చర్యకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు స్మృతీ ఇరానీ. ఇలాంటి అపరిమిత చర్య ఈ దేశ పార్లమెంట్ లో ఎన్నడూ చూడలేదన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ మణిపూర్ లో భారత మాతను కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. రెండుగా విభజించారని ఆవేదన చెందారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా తీవ్రమైన నేరానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. అనంతరం స్మృతీ ఇరానీ మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లి పోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని ఆరోపించారు. బీజేపీకి చెందిన బీజేపీ ఎంపీలు రాహుల్ పై చర్య తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
Also Read : Ponguleti Srinivas Reddy : ఏపీలో పొంగులేటికి భారీ కాంట్రాక్ట్
